అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన పరకాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ సత్తా చాటారు. చివరివరకు టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చి ఓటమి చవిచూశారు. ఒకదశలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతిపై పైచేయి సాధించినా పరాజయం తప్పలేదు. 1562 స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. కౌటింగ్ మొదలయినప్పటి నుంచి ఆధిక్యం భిక్షపతి, సురేఖల మధ్య దోబూచులాడింది. చివరికి వచ్చేసరికి ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఆఖరి రెండు రౌండ్ల కౌంటింగ్‌కు ముందు సురేఖ లీడింగ్‌లోకి రావడంతో టీఆర్‌ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలయింది. అయితే చివరి రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్ పుంజుకుని గెలుపు సొంతం చేసుకుంది.
భిక్షపతికి 51936 ఓట్లు, సురేఖకు 50374 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన టీ డీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి 30850 ఓట్లు దక్కించుకున్నారు బీజేపీ అభ్యర్థి విజయచందర్‌రెడ్డి (9160 ఓట్లు) అధికార కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు(5099) డిపాజిట్ కోల్పోయారు.
పరకాల ఉప ఎన్నికలో 83.98 శాతం పోలింగ్ నమోదయింది. ఇక్కడ 1,87,268 ఓటర్లు ఉండగా, 1,57,267 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

No comments:
Post a Comment