YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 16 June 2012

రేపటి ఓటమికి నాంది!

ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి విజయం సాధించడం దాదాపుగా అసాధ్యమని అక్కడి ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అంతేకాదు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దఎత్తున పార్లమెంటు స్థానాలను కోల్పోవడం కూడా దాదాపు ఖాయమని అవి తేల్చాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప, అక్కడ భారీగా కోల్పోయే స్థానాలను అది వేరొక చోట భర్తీ చేసుకోవడం అసాధ్యం.

చాలా స్థానాల్లో కాంగ్రెస్ ఘోరమైన ఓటమిని చవి చూడటం, పలుచోట్ల ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాబట్టి, జగన్‌కు విధేయులైన ఎంఎల్‌ఏలు పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానాన్నీ వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకోలేకపోయిందన్న అంశం కూడా కాంగ్రెస్‌కు ఊరటను కలిగించేదేమీ కాదు. 

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పట్ల ప్రజల విధేయతో లేక ఆయన కుమారునిపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరు పట్ల అసంతృప్తో వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి కారణమనే మాట ఎక్కువగా వినిపిస్తున్నది. అయితే, ఏపీ కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఆ పార్టీ కేంద్ర నాయకత్వం చేసిన దోహదం విస్మరించరానిది.

రాజకీయాలలో ఎన్నడూ ఎరగని నిష్క్రియాపరత్వానికి కాంగ్రెస్ పాల్పడింది. అత్యంత ఉద్రిక్తమైన తెలంగాణ అంశంపై చేసిన వాగ్దానాన్ని భంగం చేయడం ద్వారా అది ఘోరాపరాధానికి పాల్పడింది. తెలంగాణ ఏర్పాటు వాగ్దానంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కు వ మందిని నొప్పించింది. మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయక తెలంగాణ ఓటర్లను దూరం చేసుకుంది. 
(‘ఎకనామిక్ టైమ్స్’ సంపాదకీయం నుంచి...) 

మూలిగే నక్కపై...!

ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడింది. రాష్ట్రపతి ఎన్నికలపై సొంత మిత్రుల నుంచే తిరుగుబాటును ఎదుర్కొంటున్న సమయంలో, ఏపీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాలు కీలక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతరించిపోతోందన్న వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చి, దాని బలహీనతను బయటపెట్టాయి. జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడానికి శాయశక్తులా కృషి చేసినా, ఎన్నికలు జరిగిన పద్దెనిమిది శాసనసభ స్థానాల్లో పదిహేను స్థానాలను, నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. పలువురు శాసనసభ్యులు వైఎస్సార్‌సీపీలో చేరిపోయినందునే ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే అప్రతిహత శక్తిగా జగన్ పుంజుకుంటుండగా సీబీఐ అయనను అక్రమ సంపాదన ఆరోపణలపై అరెస్టు చేసింది... జగన్ ఆవినీతి కట్టుకథను ఓటర్లు పట్టించుకోలేదని, కాంగ్రెస్‌తో పోరులో ఆయనదే పైచేయి అని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. 2009లో ఈ పద్దెనిమిది సీట్లలో పదిహేడు కాంగ్రెస్‌వి. జగన్‌తో తలపడ్డాక దానికిప్పుడు రెండు సీట్లు మిగి లాయి. పది సీట్లలో అది మూడో స్థానంలో నిలిచింది, ప్రతి ఐదింటిలో ఒక స్థానంలో డిపాజిట్‌ను కోల్పోయింది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో తన సొంత అభ్యర్థిని నిలపడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కీలకమైన పలు పెద్ద రాష్ట్రాలలో దాని పునాదులు బలహీనపడిపడ్డాయని అది సూచి స్తోంది. ఆ రాష్ట్రాలలో సొంత బలంలేక అది ప్రాంతీయ భాగస్వాములపై ఆధారపడుతోంది. అవి సహజంగానే తమ స్వప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఓటమికి మించిన దుర్వార్త దానికి మరొకటి ఉండదు. 
(‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంపాదకీయం నుంచి...)

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!