నల్లధనంపై పోరులో రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్న యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు సీపీఐ షాకిచ్చింది. ఈ పోరాటంలో తనకు మద్దతివ్వాలన్న ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. రామ్‌దేవ్‌తో కలిసి ఉద్యమించేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంలో సొంత పోరాటం చేపడతామని ప్రకటించింది. ఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీనియర్ నేత ఎ.బి.బర్ధన్‌లతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం బర్ధన్ విలేకరులతో మాట్లాడుతూ రామ్‌దేవ్ ప్రస్తావించిన అంశాలపై చాలా వరకూ తమ పార్టీ ఏకీభవిస్తోందన్నారు. అయితే తాము ఈ అంశంపై విడిగా పోరు సాగిస్తామన్నారు. ఆగస్టు 9 నుంచి రామ్‌దేవ్ చే పట్టే ఉద్యమంలో పాల్గొనబోమని... కానీ అదే రోజు నుంచి తమ పార్టీ కూడా పోరు సాగిస్తుందన్నారు. మరోవైపు సీపీఎం కూడా ఇదే వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌ను కలవాలనుకుంటున్న రామ్‌దేవ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ఆ పార్టీ సుముఖంగా లేనట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
Friday, 15 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment