= ఓటమిని అంగీకరిస్తున్నాం
= మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేసినా గెలవలేకపోయాం
= {పజల తీర్పు బాధ కలిగించినా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా
=విలేకరుల సమావేశంలో ఎంపీ మాగుంట
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒక పక్క జైల్లో ఉండి బాధపడుతూ, తల్లిని, చెల్లిని ప్రచారానికి పంపి పార్టీ విజయానికి కృషి చేయడంలో జగన్ విధానాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అభినందించక తప్పదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రజా తీర్పుతో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు సానుభూతికి విజయం చేకూర్చారన్నారు. ఎన్నికలకు ముందు జగన్ అరెస్టు కూడా పార్టీ ఫలితాలపై ప్రభావం చూపిందని చెప్పారు. ఒకపక్క మంత్రులు, మరోపక్క ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా పనిచేసినా పార్టీ విజయం సాధించకపోవడం నిరాశ కలిగించిందన్నారు.
ఓటమితో ఎటువంటి సంబంధం లేకుండా భవిష్యత్‌లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే కార్యకర్తలు కూడా తమ సమస్యలపై ఎల్లప్పుడూ తనను సంప్రదించవచ్చన్నారు. పార్టీ ఓటమి పాలైన కూడా తమ కుటుంబం తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం ఉండదని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా సేవకు అంకితమైన తమ కుటుంబానికి ప్రజలు ఇటువంటి తీర్పు ఇవ్వడం కొంత బాధ కలిగించిందన్నారు. మేము చేసిన తప్పు ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం మేరకే పార్వతమ్మను ఒంగోల్లో పోటీ చేయించామన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలిపారు.

No comments:
Post a Comment