పన్నెండు జిల్లాల్లో పద్దెనిమిది శాసనసభ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు ముగిశాయి. వాటిని ఉప ఎన్నికలు అనడం కంటే మినీ జనరల్ ఎన్నికలు అనడమే సరైనది. రెఫరెండం అనడం వాస్తవానికి దగ్గరగా ఉంటుందేమో. పోలింగ్ బూత్ వద్ద ఉదయం ఎనిమిది గంటల్లోపే మహిళలు ఓటరు హోదాలో బారులు తీరి ఉండటం జగన్ ప్రభంజనం ఉధృతికి నిదర్శనమని చెప్పాలి. ఓటరు సరళిని బట్టి చూస్తే అన్ని స్థానాలు లేదా అత్యధిక స్థానాలు జగన్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. రేపటి ఈ విజయం సోనియా-కిరణ్ సర్కార్ల మీద అభిశంసనగా భావించవచ్చు. తన సర్కారుకు ఢోకా లేదని పైకి ప్రకటించుకున్నా, కాంగ్రెస్ తమ వనరులన్నీ ఒడ్డి పోరాడింది.
అది చేయని అకృత్యమంటూ లేదు. తిరుపతి లాంటి చోట ఓటుకు రెండు, మూడు వేలు కూడా పంచినట్లు తెలుస్తోంది. కిరణ్, చిరంజీవి శక్తికి మించి పనిచేశారు. ఇంచుమించు అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పోకడ ఇంతే. ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినా, మిగిలిన ప్రభుత్వ సిబ్బంది అధికార పార్టీకి ప్రతిచోటా వత్తాసు పలికారు. వేలాది మంది జగన్ పార్టీ కార్యకర్తలను బైండోవర్ కింద నిర్బంధించారు. అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగింది. అయినా ఓటింగ్ శాతం పెరగడాన్ని బట్టి, ఓటర్ల ఆవేశాన్ని బట్టి అన్ని అడ్డంకులను ఎదుర్కొని జగన్ పక్షం విజయఢంకా మోగించిందనే విశ్వసించవచ్చు.
సోనియా కక్ష! కాంగ్రెస్‌కు శాపం!
జగన్ ఎన్నికల ప్రచార హోరు చూసి అసూయ చెంది ఇంటరాగేషన్ పేరిట జగన్‌ను హాజరు కమ్మని అరెస్టు చేయడం పరమ మోసంగా జనం అర్థం చేసుకున్నారు. సోనియా కనుసన్నల్లో పనిచేస్తూ సీబీఐ జగన్ మీద కక్షసాధింపు కొనసాగిస్తూ, అతని రాజకీయ స్వేచ్ఛను అరికడుతూ జైల్లో బంధించాలన్నది సీబీఐ లక్ష్యం. జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ 154 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు సంతకం చేయడమే సోనియాను గంగవైలెత్తించింది. ఓదార్పుయాత్రలో పాల్గొంటున్న జన ప్రభంజనం చూసి ఆమె సహనం కోల్పోయింది. విజయమ్మకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా అవమానపరిచింది. జగన్‌ను ఒంటరివాడిని చేయడానికి తన బాబాయి వివేకానందరెడ్డిని చేరదీసి మంత్రి పదవి ఇచ్చింది.
రాజకీయాల్లో తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి మరో పార్టీ పెట్టవలసిన పరిస్థితిని జగన్‌కు తప్పనిసరి చేసింది. వైఎస్ మరణవార్త విని గుండె ఆగి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష ఇస్తామని ప్రకటించి సంవత్సరం పైబడినా ఆమె వారిని పట్టించుకోలేదు. తన భజనపరులకు పదవులు కట్టబెట్టి వైఎస్ పథకాలను అటకెక్కించి, రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు కల్పించి, ఉప ఎన్నికలకు దారితీసే పరిస్థితులను కల్పించింది సోనియాగాంధీనే. తన చేత హైకోర్టులో వైఎస్ ఆస్తుల మీద పిల్ వేయించింది సోనియానేనని డా॥శంకర్రావు స్పష్టం చేశాడు. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది తడవుగా సదరు శంకర్రావుకు మంత్రి పదవి లభించింది. ఇంతకంటే క్విడ్ ప్రో కో ఉంటుందా? నెల్లూరు పార్లమెంటు సీటులో మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఓడించడానికి కోటీశ్వరుడైన టి.సుబ్బిరామిరెడ్డిని రంగంలో దింపింది. ఆయన ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో గానీ మేకపాటి రెండు లక్షల మెజారిటీతో గెలవనున్నట్లు రూఢిగా తెలుస్తోంది. మేకపాటి విజయం రేపు సోనియాకు షాక్ ఇవ్వకపోదు.
చంద్రబాబు వర్సెస్ కోలా!
చంద్రబాబు లక్ష కోట్ల ఊతపదంలోని బూటకాన్ని మైసూరా బయటపెట్టి బాబు గాలి తీసేశాడు. ఆ షాక్ నుంచి బాబు ఇంకా కోలుకోకముందే కోలా కృష్ణమోహన్ మరో షాక్ ఇచ్చాడు. జగన్ కటకటాలపాలు కావడంతో తన లక్ష్యం నెరవేరినట్లు మురిసిపోతున్న సమయంలో ‘కోలా’ ఆరోపణల పత్రం మీడియాకెక్కింది. ఆ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, తన పాత నేస్తం ‘కోలా’ ఒక 420 అని సులభంగా కొట్టిపారేశాడు. ‘కోలా’ ఈ సవాల్‌ను అందుకుని చంద్రబాబు పది రెట్లు 420 అని ప్రతిస్పందించాడు.
‘కోలా’ ఆరోపణలు చూస్తే పాఠకులకు మతిపోయేటట్లుంది. అందులో పాఠకులకు డోకు తెప్పించే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబు మీద ‘కోలా’ చేసిన ఆరోపణలకు నిర్దిష్టత ఉంది. బాబుతో ఆయన చేసిన లావాదేవీలకు తేదీలు, బ్యాంకు అకౌంట్ల నంబర్లు, మధ్యవర్తుల పేర్లు అన్నీ ఉన్నాయి. ఈ ఆరోపణలు చూసిన సీపీఐ కార్యదర్శి నారాయణ ఈ ఆరోపణలు విచారించి చర్య తీసుకోవాలన్నారు. బుకాయింపులు మానుకుని ఈ ఆరోపణలపై సీబీఐ విచారణకు బాబు సిద్ధపడాలి.
సిగ్గుమాలిన సీబీఐ!
ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ సాధించబోయే విజయం సీబీఐని ఏ మేర ప్రభావితం చేస్తుందో తెలియదు గానీ, ఇంతవరకు జగన్ పట్ల అది ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనది. దాని నిర్వాకం సామాన్యులకు కూడా తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో సీబీఐ పనిచేయక తప్పదని, సీబీఐ మాజీ డెరైక్టర్ జోగీందర్‌సింగ్ ఏనాడో స్పష్టం చేశాడు. జగన్ పట్ల సీబీఐ ప్రవర్తనను జాతీయస్థాయి మీడియా కూడా నిరసించింది. నేరానికి, నేరారోపణకు తేడా పాటించకుండా జగన్ నేరం చేసినట్లుగా సీబీఐ ప్రవర్తిస్తున్న తీరు పరమ దారుణంగా ఉంది. ఏడు రోజుల కస్టడీలో సీబీఐ ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా జగన్ సమాధానం చెప్పినా కూడా, జగన్ సహకరించలేదని నిందిస్తూ జగన్‌కు నార్కో అనాలిసిస్ చేయించడానికి కోర్టు అనుమతిని సీబీఐ కోరింది.
నార్కో అనాలిసిస్ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని సుప్రీం మొట్టికాయ వేసినా సీబీఐ కోర్టు అందుకు అనుమతి కోరడం సుప్రీంకోర్టును ధిక్కరించడం కాదా? సుప్రీంకోర్టు కంటే సీబీఐ ఎక్కువ కాబోలు! ఎవరో అన్నట్లు నార్కో అనాలిసిస్ చేయాల్సింది జగన్‌కు కాదు, కుట్రలు, కుతంత్రాలు బయటికి లాగడానికి సోనియా, కిరణ్, బొత్స, చంద్రబాబులకు చేస్తే సబబుగా ఉంటుంది. జగన్‌ను ఇక ఒక క్షణం కూడా జైల్లో బంధించడం సమర్థనీయం కాదు. అతడు ఒక పార్టీ అధ్యక్షుడు, దేశంలోనే ఎక్కువ మెజారిటీతో పార్లమెంటుకు ఎన్నికైన వాడన్న సంగతి విస్మరించి సీబీఐ మర్యాద లేకుండా ప్రవర్తించడం క్షంతవ్యం కాదు.
ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా ప్రజాతీర్పు!
లగడపాటి అంచనా ప్రకారమైనా జగన్ పార్టీకి 16 సీట్లు వచ్చినా అది 90 శాతం విజయం అవుతుంది. అది సోనియా పార్టీని ఎదుర్కోని జైల్లో ఉండి జగన్ సాధించిన ఘన విజయంగా గుర్తింపు పొందుతుంది. జగన్‌ను అరెస్టు చేసిన తదుపరి ప్రచార బాధ్యతను విజయమ్మ తన భుజస్కంధాల మీద వేసుకొని షర్మిలతోపాటు చేసిన సుడిగాలి పర్యటన ప్రజలను ప్రభావితం చేసిన తీరు అనితర సాధ్యమని చెప్పక తప్పదు.
కాంగ్రెస్ ఓట్లు చీలుతాయని, అది టీడీపీకి లాభిస్తుందని చంద్రబాబు లెక్కలు కట్టాడు. 2014 నాటికి చంద్రబాబు సైన్యం లేని సైన్యాధిపతిగా ఉంటాడన్నది దాచేస్తే దాగని సత్యం. జగన్ మీద బురద చల్లడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల మీద చంద్రబాబు చేసిన ఉద్యమం అంటూ ఏమీలేదు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడకుండా ప్రతిపక్ష నేతగా తన పాత్రను నిర్వహిస్తే 2014 వరకు చంద్రబాబు మిగులుతాడు. లేకపోతే ఆయన మిగలడు, ఆయన పార్టీ మిగలదు.
రాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యాయం!
జూన్ 15 తర్వాత జగన్ పార్టీ బలమైన రాజకీయశక్తిగా ఎదగడం తథ్యం. ఎన్నికలలో సిద్ధించే విజయం జగన్‌కు ఈ మహదావకాశాన్ని కల్పిస్తుంది. 2014 వరకు జనం మధ్యనే ఉంటూ జగనే జనం అన్న మాటను నిలబెట్టుకోవాలి. రేపు శాసనసభలో జగన్ పార్టీ శాసనసభ్యుల ప్రవేశంతో సభా స్వరూపం మారి పోతుంది. శాసనసభలో నిజమైన ప్రతిపక్షంగా, శాసనసభ వేదికను ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగించే ప్రతిపక్షంగా నిరూపించుకుంటుంది. 2014లో జగన్ పార్టీకి 200 సీట్లు ఖాయమని తెలంగాణ వాస్తవ్యులు, రాజకీ యాల్లో కురువృద్ధుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. 2014 నాటికి వైఎస్‌ఆర్ పార్టీ టిక్కెట్టు కోసం నాయకులు క్యూ కడతారంటే అతిశయోక్తి కాదు. అధిక ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ, పారిశ్రామికరంగాల్లో అస్తవ్యస్త పరిస్థి తులు, అటకెక్కించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇలాంటి మునిగిపోతున్న పడవలో ఎవరెక్కుతారు?! ఎవరూ ఎక్కరు. ఆ పడవ నుంచి చివరకు చీమలు కూడా పారిపోతాయి.

No comments:
Post a Comment