రాష్ట్ర శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 17కు పెరిగింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 15 సీట్లు గెల్చుకుంది. ఇప్పటివరకు వైఎస్సార్ సీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఉపపోరులో 15 సీట్లు గెల్చుకోవడంతో ఈ సంఖ్య 17కు చేరింది. పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ, కోవూరు నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన సంగతి తెలిసిందే.
మరోవైపు లోక్‌సభలో వైఎస్సార్ సీపీ బలం రెండుకు పెరిగింది. నెల్లూరు ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందడంతో ఆ పార్టీకి ఇప్పుడు ఇద్దరు ఎంపీలయ్యారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రికార్డు మెజారిటీతో గెలిచిన సంగతి విదితమే.

No comments:
Post a Comment