వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆడిటర్ విజయసాయిలను నార్కో పరీక్షకు అనుమతించాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ వాస్తవాలకు విరుద్ధంగా ఉంది, చట్టసమ్మతం కాదని కౌంటర్ పిటిషన్‌లో జగన్ తరఫు న్యాయవాదులు పేర్కోన్నారు. సీబీఐ చెబుతున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలు, అవాస్తవాలని న్యాయవాదులు తెలిపారు. గతంలో విజయసాయికి నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సీబీఐ వేసిన పిటిషన్ను ఇదే కోర్టు కొట్టివేసింది. మళ్లీ సీబీఐ కోర్టులో ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేయడం చట్ట విరుద్ధమని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు.
సత్యం కేసులో నార్కో పరీక్షలు చట్టసమ్మతం కాదని హైకోర్టు స్పష్టం చేసిందని.. జగన్, విజయసాయిలను వేధించడానికే సీబీఐ నార్కో పిటిషన్ దాఖలు చేసిందని వారు ఆరోపించారు. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసిన సీబీఐపై జరిమానా విధించాలని కౌంటర్ పిటిషన్‌లో జగన్ తరఫు న్యాయవాదులు డిమాండ్ చేశారు. జగన్, విజయసాయి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించారని వారు తెలిపారు.

No comments:
Post a Comment