YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 15 June 2012

ఉత్తరాంధ్రలో ఫ్యాన్ ప్రభంజనం

ఉత్తరాంధ్రలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట, విశాఖ జిల్లా పాయకరావుపేట స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.

నర్సన్నపేటలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ 7312 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 54454 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన రామదాసుకు 47142 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి శిమ్మ స్వామిబాబు 32401 ఓట్లు దక్కించుకున్నారు. ఇక్కడ 80.18 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం ఓట్లు 1,74,930 కాగా, 1,40,258 ఓట్లు పోలయ్యాయి.

పాయకరావుపేటలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొల్ల బాబూరావు 14362 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 71963 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుకు 57601 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి గంటెన సుమనకు 33867 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 85.00 పోలింగ్ నమోద యింది. మొత్తం 2,02,953 మంది ఓటర్లు ఉండగా, 1,72,510 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!