= లేనిపక్షంలో బిక్షపతితో రాజీనామా చేయించాలి
= టీఆర్‌ఎస్‌కు కొండా సురేఖ డిమాండ్

పరకాల(వరంగల్), న్యూస్‌లైన్: పరకాలలో టీఆర్‌ఎస్ గెలిస్తే మూడునెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ చెప్పినట్లుగా ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో.. పరకాలలో గెలి చిన మొలుగూరి బిక్షపతి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ అన్నారు. ఆమె శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ... ‘‘టీఆర్‌ఎస్ వాళ్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులను పల్లెల్లోకి తీసుకొచ్చి ప్రచారం చేయించారు. ఇక విద్యార్థి, జేఏసీల పేరుతో బస్సుయాత్రలు, రెచ్చగొట్టే ఫొటోలు, వాల్‌పోస్టర్లతో మాపై దుష్ర్పచారం సాగించారు. అయినప్పటికీ.. ఈ తీర్పుతో నైతికంగా మేమే గెలిచాం’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ క్రాస్‌ఓటింగ్ వల్ల చివరి నిమిషంలో ఓటమి పాలయ్యామని ఆమె చెప్పా రు. అయినా ప్రజలు తమను ఆదరించినందుకు గర్వపడుతున్నామన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు తననే గెలిపిస్తారనే నమ్మకముందన్నారు.

No comments:
Post a Comment