ఉపఎన్నికల్లో కాంగెస్‌పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బులు విపరీతంగా పంపిణీ చేయడమేగాక,ప్రతిపక్షపార్టీతో మిలాఖత్ అయినా అన్నిస్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనస్ఫూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, ప్రజలు రాజశేఖరరెడ్డికే ఓటువేస్తున్నామన్న ఆలోచనతో వేసినందునే ఇంత భారీగా పోలింగైందన్నారు. అందుకే ఎంపీతో సహా అన్నిస్థానాలు తామే గెలుస్తామన్నారు.
No comments:
Post a Comment