హైదరాబాద్, న్యూస్‌లైన్: మైనారిటీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ తీరువల్లే ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్ల ఉప కోటాపై సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైందన్నారు. దివంగత వైఎస్సార్ లేని లోటు ముస్లింలకు స్పష్టంగా కనబడుతోందని చెప్పారు.
ఆయన బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ముస్లింలు తలాక్ చెప్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్‌కు గులాంగిరీ చేస్తున్న మైనారిటీ నేతలకు సిగ్గుంటే వెంటనే పార్టీ విడిచి బయటకు రావాలన్నారు. మైనారిటీలందరూ జగన్ వెంట నడిచేందుకు గర్వపడుతున్నారని రెహమాన్ పేర్కొన్నారు. మైనార్టీలకు సబ్‌కోటాను పునరుద్ధరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

No comments:
Post a Comment