వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలోని దళితులను వేటాడి చంపిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. దళితులంటే పశువుల కన్నా హీనంగా చూసేవారిని ఊపేక్షించరాదని, దళితులను అతి దారుణంగా హత్య చేయడం అనాగరికమని, కేవలం భూ సమస్యపై ఇంతటి మారణ కాండకు పాల్పడడం హేయనీయమని అన్నారు. లక్ష్మీపేట బాధితులకు న్యాయం చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన బాధాకరమని, ఇటువంటి సంఘటనలతో పబ్లిక్ రంగ సంస్థలపై నమ్మకం పోతుందని జూపూడి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment