ఈనాడులో వచ్చిన కథనంపై రామోజీరావుని నిందితునిగా పేర్కొంటూ దాఖలైన పరువునష్టం కేసు తీర్పుని విశాఖ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జూలై 9కి వాయిదా వేసింది. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించేలా రామోజీరావుకు చెందిన ఈనాడులో ప్రచురించిన కథనంపై క్లాస్-1 కాంట్రాక్టర్ చిన్ని వెంకట్రావు పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో రివిజన్ పిటీషన్ పెండింగ్‌లో ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
2006లో కంచరపాలెంకు చెందిన క్లాస్ 1 కాంట్రాక్టర్ చిన్ని వెంకట్రావు, అతని సోదరుని మధ్య ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు తలెత్తాయి. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రామోజీరావు తన దినపత్రికలో కాంట్రాక్టర్ చిన్ని వెంకట్రావుపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ వార్తను ప్రచురించారు. ఈనాడు కథనాన్ని చూసి ఖంగుతిన్న వెంకట్రావు, ఆరోపణలను ఖండిస్తూ పలు లేఖలు పంపినా ప్రచురించలేదు. ఖండన ప్రకటనలను బుట్టదాఖలు చేశారు. దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చిన రామోజీ రావు, అతని సంస్ధపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రామోజీరావును నిందితుడిగా పేర్కొంటూ వెంకట్రావు పరువు నష్టం దావా వేశారు

No comments:
Post a Comment