వైఎస్ విజయమ్మపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామారావు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వానికి నిదర్శనమన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు వైఎస్సార్ చేసినంత మేలు ఏ సీఎం చేయలేదని గుర్తు చేశారు. 3 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి చేనేత కార్మికులకు కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికు సమస్యల పరిష్కారానికి పూనుకున్న విజయమ్మను ఆహ్వానించడం మాని విమర్శించడాన్ని కేటీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. విజయమ్మ పర్యటన అంటే మీకు అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరి ఇదివరకే చెప్పామన్నారు. రాజకీయ లబ్ధికోసం నాటకాలాడితే ప్రజలు విశ్వసించరని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీకి వీలైతే మద్దతు పలకాలని మహేందర్‌రెడ్డి సూచించారు.

No comments:
Post a Comment