కృష్ణాజిల్లా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే నాని సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. నాని గత కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై అసంతృప్తిగా ఉండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.కాసేపట్లో జైలు లో జగన్ ని కలిసే అవకాశం.
కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. నాని ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ విషయం తెలిసిన టీడీపీ వెంటనే నానిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
జూనియర్ ఎన్టీఆర్ అనుచరుడిగా నానికి పేరు. గుడివాడ నుంచి ఆయన రెండుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్‌తో కొన్ని సినిమాలు కూడా తీశారు. గత కొంతకాలంగా నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కృష్ణా జిల్లాలో పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాల్లోనూ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన కినుక వహించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానపర్చుతున్నారని నాని ఏడాది క్రితమే చంద్రబాబును నిలదీశారు. అప్పుడు ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.

No comments:
Post a Comment