అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పూర్తిగా విస్మరించినందునే 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలు కావాల్సివచ్చిందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హితవు పలికారు. ఇప్పుడు బీసీలకు ఏదో చేస్తామని చెప్పడంకన్నా.. గతాన్ని పునరావృతం కానివ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని టీడీపీ నేతల్ని ఆయన డిమాండ్ చేశారు. ‘సాక్షి’ టీవీలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన బుధవారం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామన్న qటీడీపీ ప్రకటన పట్ల పై విధంగా స్పందించారు.
1996లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల పేరుతో తీర్మానం చేసిన చంద్రబాబు, ఆ తర్వాత కేంద్రంపై ఎలాంటి ఒత్తిడీ చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున బీసీలకు వంద సీట్లు ఇస్తామంటూ వరంగల్ సభలో చేసిన డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కరడుగట్టిన బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోన్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు ఎందుకు పోరాటాలు చేయలేదని నిలదీశారు. గతంలో ఉన్న ఫీజుల్ని కూడా బీసీ విద్యార్థులకు చంద్రబాబు కొనసాగించలేకపోయారని, జిల్లాకో కళాశాల హాస్టల్ ఏర్పాటు చేస్తానని చెప్పి చేయలేదని ఆరోపించారు. ఇవన్నీ టీడీపీ నేతలను విమర్శించేందుకు కాదని, ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని చెపుతున్నానని ఆయన చెప్పారు.
చెప్పడం కాదు.. ఆచరణలో పెట్టండి..
ఇదిలా ఉండగా కృష్ణయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు వందసీట్లు ఇస్తామని ప్రకటించిన టీడీపీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దీన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. టీడీపీ ఇచ్చిన బీసీల డిక్లరేషన్‌లో స్పష్టత లేదన్నారు. జాతీయస్థాయిలో చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకోసం అన్నిపార్టీలూ కృషిచేయాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని, ప్రతి బీసీ కుటుంబానికి ఐదు నుంచి 50 లక్షల వరకు రుణాలివ్వాలని కోరారు.

No comments:
Post a Comment