వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వరంగల్ జిల్లా పరకాలలో గట్టి పోటీ ఇవ్వడంతో , ఆ పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జెఎసి దృష్టి పెట్టినట్లు కనబడుతుంది.ఇటీవలి కాలంలో ఎవరు ఎక్కడ తిరిగినా అభ్యంతరం లేదని చెబుతున్న తెలంగాణ నేతలు ఇప్పుడు మళ్లీ విజయమ్మ పర్యటనను వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు ఆర్మూరులో జగన్ రైతు దీక్ష చేసినప్పుడు పట్టించుకోని టిఆర్ఎస్ కాని, జెఎసి కాని ఇప్పుడు సిరిసిల్లలో విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని చూస్తోంది. భారీ మెజార్టీతో కనుక పరకాలలో టిఆర్ఎస్ గెలిచి ఉంటే టిఆర్ఎస్ కాని, టిజెఎసి కాని ఈమె పర్యటనను సీరియస్ గా తీసుకుని ఉండేవి కావేమో. కాని పరకాలలో కేవలం రెండువేల ఓట్ల తేడాతోనే టిఆర్ ఎస్ గెలవడం ఆ పార్టీ నేతలకు జీర్ణం కాని విషయంగా ఉంది. దీనితోనే ఇప్పటి నుంచే జనంలో మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టకపోతే కష్టమన్న భావనతోనే వారు ఆమెపై విమర్శలు చే్స్తున్నారనిపిస్తుంది. పైగా విజయమ్మ ఒక మాట చెప్పారు. కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికి అయినా కట్టుబడి ఉంటామని ప్రకటించారు. అంటే తెలంగాణ బాధ్యత కేంద్రానిదేనని ఆమె చెప్పకచెప్పారు. అయినా ఇప్పుడు టిఆర్ఎస్ వారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను మరింత స్పష్టత ఇవ్వాలని కోరడం అంటే ఇది రాజకీయంలో భాగమేనని, ఓట్ల యావలో ఇదొక అంశమని విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
source: kommineni
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment