టీడీపీని ఆ భగవంతుడే రక్షించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీపై భరోసా కోల్పోయిన నేతలు వాళ్ల భవిష్యత్‌ను వాళ్లు చూసుకుంటున్నారని ఆయన అన్నారు. టీడీపీ ప్రజల్లో రానురాను విశ్వసనీయత కోల్పోతోందని మేకపాటి అన్నారు. టీడీపీ నేతల ఆరోపణలు ఆ పార్టీని మరింత పలుచన చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కొడాలి నాని డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తా అని మేకపాటి ప్రశ్నించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. సీబీఐ కక్షపూరిత వైఖరి మానుకోవాలని.. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్రవర్తించాలని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment