హైదరాబాద్, న్యూస్‌లైన్:
తన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో జరిగిన వాదనలకు వక్రభాష్యం చెబుతూ పత్రికలో కథనాన్ని ప్రచురించిన ఈనాడు సంస్థల అధినేత సీహెచ్.రామోజీరావు, ఆయన కుమారుడు సీహెచ్.కిరణ్, విలేకరి నారాయణరెడ్డి, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి సీఆర్‌పీసీ సెక్షన్ 199 కింద కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఐపీసీ 500, 501 కింద వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని పదిహేడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. ‘గత ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో నా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలపై.. ‘‘లబ్ధి పొందింది జగనే... నాకు ఒరిగిందేమీ లేదు... విజయసాయిరెడ్డి స్పష్టీకరణ’’ అంటూ ఏప్రిల్ 28న ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఇది పూర్తిగా నిరాధారమైనది. నా పరువుకు భంగం కలిగించేదిగా ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా నన్ను కించపర్చడానికే ఆ కథనం రాసినట్లుగా ఉంది’’ అని సాయిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు కలిగిన పరువు నష్టానికి గాను క్షమాపణలు చెప్పాలని రామోజీకి లీగల్ నోటీసులు జారీ చేసినా.. ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment