బీసీల జపం చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు పగటికలలు కంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబును నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైఎస్ విజయమ్మను ఉద్దేశించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. చేనేత కార్మికుల కోసం ఒక్కరోజైనా కేటీఆర్ పోరాటం చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ బలపడితే టీఆర్ఎస్ మూతపడుతుందని కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. తెలంగాణలో ప్రజల సమస్యల గురించి విజయమ్మకు అవగాహన ఉందని గట్టు రామచంద్రరావు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment