తెలుగుదేశం పార్టీలో దళితులకు చోటు లేదని ఆపార్టీ నుంచి సస్పెండ్ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. బాబు హయాంలో పార్టీకి దళితులు, మైనార్టీ, బీసీలు దూరం అవుతున్నారని ఆమె గురువారమిక్కడ అన్నారు. కుట్ర చేసి తనను పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపారని కల్పన ఆరోపించారు.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అని చెప్పుకోవటం కోసమే పార్టీలో తమలాంటి దళితులకు పదవులు ఇచ్చారన్నారు. తనను బయటకు పంపటం దళితులను అవమానపరచటమేనని కల్పన వ్యాఖ్యానించారు.
తాను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించటానికే కలిశానని, ఆ కారణానికే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం దారుణమన్నారు. వివరణ కోరకుండా సస్పెండ్ ఎలా చేస్తారని కల్పన ప్రశ్నించారు. అగ్రకులాలకు ఓ న్యాయం, దళితులకు ఓ న్యాయమా అని నిలదీశారు. బాబు ఏనాడు పొలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయాలను అమలు చేయలేదన్నారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటిస్తానని కల్పన తెలిపారు. జగన్ వెంట ప్రజలు, ప్రజాభిమానం ఉందని ఆమె అన్నారు.

No comments:
Post a Comment