టీడీపీలో బడుగు, బలహీనవర్గాలకు చోటు లేదని ఉప్పులేటి కల్పన ఆరోపించారు. సస్పెన్షన్ కు గురైన టీడీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని.. పార్టీని వీడినవారిపై తిరగబడాలని చెప్పడం ఆయన మానసిక స్థాయిని తెలుపుతోందని ఆమె అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మానసిక స్థాయి తప్పినట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారని...అప్పుడు ప్రజలు తిరగబడి ఉంటే చంద్రబాబు ఎక్కడ ఉండేవారోనని ఉప్పేలేటి కల్పన అన్నారు.
ఎలాంటి వివరణ కోరకుండా ఏకపక్షంగా సస్సెన్షన్ నిర్ణయం తీసుకున్నారని..తనకు మేకపాటి కుటుంబం అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని ఉప్పులేటి కల్పన వివరణ ఇచ్చారు. మేకపాటి తల్లి చనిపోయినందున పరామర్శించడానికే వెళ్లానని ఆమె స్పష్టం చేశారు. టీడీపీలో అగ్రవర్ణాలకో న్యాయం.. దళితులకో న్యాయమా అని కల్పన ప్రశ్నించారు.
Wednesday, 11 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment