వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబును గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్ లో పరామర్శించారు. అంబటి రాంబాబు తండ్రి ఏవీఎస్‌ఆర్ ఆంజనేయులు (83) ఆదివారం సాయంత్రం 5.10 గంటలకు హైదరాబాద్ మోతీనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంజనేయులు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా రేపల్లేలో సోమవారం సాయంత్రం ముగిసాయి. అంబటి ఆంజనేయులు కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేశారు. రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య, రాష్ట్ర ట్రేడింగ్ కార్పొరేషన్ సంస్థలకు గతంలో డెరైక్టర్‌గా సేవలందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment