పల్లెల్లో కనీసం ఒక్క గంట కూడా పూర్తి స్థాయిలో కరెంట్ ఉండడంలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి లేకపోవడం ఓ సమస్య అయితే ఉన్న కరెంట్ వినియోగించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు.
మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో కడపలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రజల తరఫున ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. సరఫరా కొరత ఉన్న మాట వాస్తవమేనని, అయితే అధికారులు సక్రమంగానే పనిచేస్తున్నారంటూ మంత్రి వెనుకేసుకొచ్చారు. విద్యుత్ సరఫరాను క్రమబద్దీకరించి వ్యవసాయ అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment