హైదరాబాద్, న్యూస్‌లైన్:
సుప్రీంకోర్టు నోటీసులందుకున్న మంత్రులకు న్యాయ సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే ఆ 26 జీవోలు సక్రమమైనవేనన్న విషయం స్పష్టమవుతోందని శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ జీవోలన్నీ సక్రమమేనని ప్రభుత్వం భావిస్తున్నపుడు ఇక కేసులెందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అనేది తేలిపోతోందని చెప్పారు. జగన్‌పై పెట్టిన కేసుల్లో ఎలాంటి పస లేదని, అందువల్ల ఆయనకు త్వరలో బెయిల్ వస్తుందని తెలిపారు. ఇప్పటికే బెయిల్ రావాల్సి ఉందని, ఎందుకు ఆలస్యమవుతోందో అర్థం కాకుండా ఉందని అన్నారు. కొడాలి నాని విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎమ్మెల్యేలను కొంటున్నది ఎవరో, ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నది ఎవరో అందరికీ తెలుసునని బాలినేని చెప్పారు.
ఆయన పార్టీలో ఎమ్మెల్యేలను నిలుపుకోలేక డబ్బుకు అమ్ముడుపోతున్నారంటూ చంద్రబాబు ఆరోపించడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వాన్‌పిక్ విషయంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని బాలినేని డిమాండ్ చేశారు. డొక్కా ఎన్నికల సందర్భంగా ఏరువాక చేసి వాన్‌పిక్‌ను రద్దుచేయాలని కోరారని గుర్తు చేశారు. మాణిక్య వరప్రసాద్‌పై కేసు వే స్తున్నారని తెలిసి వాన్‌పిక్ ప్రతినిధులను ఆయన పిలిపించుకొన్నారని, ఎన్నికలు కనుక అలా మాట్లాడానే తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పుకున్నారని బాలినేని తెలిపారు. వాన్‌పిక్‌ను రద్దు చేసి రైతులకు భూములు ఇప్పిస్తే ఆయన నాయకత్వంలో తామంతా వస్తామని అన్నారు. డొక్కా మాట మీద నిలబడకపోతే ఇన్‌చార్జి మంత్రిగా జిల్లాకు వచ్చే అర్హతను కోల్పోయినట్లేనని చెప్పారు.
No comments:
Post a Comment