అధికార పార్టీతో కుమ్మక్కైన టీడీపీ తీరును సొంత పార్టీ నాయకులే తప్పుపడుతున్నారు. ప్రజా ప్రయోజనాల్ని విస్మరించి, ప్రతిపక్ష బాధ్యతల్ని పక్కన పెట్టిన టీడీపీకి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాక్ ఇచ్చారు. చంద్రబాబు తీరుతో మనస్తాపానికి గురైన కొడాలి నాని పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు.
దాంతో నానిపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యవహారాల్లో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి టీడీపీ తరపున రెండుసార్లు నాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో దేవినేని ఉమా పెత్తనం కొనసాగుతోందని, ప్రొటోకాల్ ప్రకారం కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చంద్రబాబు దృష్టికి ఆయన చాలాసార్లు తీసుకువచ్చారు.

No comments:
Post a Comment