YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 9 July 2012

ఆ భయమే మహానేతను సైతం మట్టుపెట్టే మహాకుట్రకు తెరతీసింది

ఎక్కడ బతుకుతున్నాం మనం 
రాష్ట్రం కోసం చివరిశ్వాస ను అంకితం చేసిన మహానేత రాజన్న కొడుకుని
ఓదార్పు యాత్ర తో జనజీవితాలతో మమేకమైన జననేతను జైల్లో పెట్టుకుని 
ఏమీ ఎరగనట్టు .. ఏమీ జరగనట్టు 
ఎలా బ్రతికేస్తున్నాం మనం. 
నేనూ నాకుంపటి 
నేనూ నా కుటుంబం 
నేనూ నా సంపాదన 
ఇవితప్ప ఇంకేమీ పట్టని మన అందరిమధ్యలో 
నా ప్రజలూ నా రాష్ట్రం 
అనుకోవటమేనా తన తప్పు!
పదవులూ అవకాశాలూ కళ్ళ ముందూ కాళ్ళ ముందూ ఉన్నా
ఆత్మాభిమానాన్ని నమ్ముకొని నిప్పుల గుండం లోకి దూకటమేనా 
తను చేసిన నేరం 
నీతికి నిలబడటం ఏటికి ఎదురీదటమేనా తను చేసిన రాజ్యద్రోహం 
రాజన్న కొడుకుగా రాజభోగాలు 
అనుభవించే అవకాశం ఉన్నా 
పదవులూ పందేరాలూ పంచభక్ష్య పరమాన్నాలూ 
గుమ్మం ముందు కాపలాకాస్తున్నా
అన్నిటికన్నా ఆత్మాభిమానమే గొప్పది అనుకున్నాడు 
అందుకే 
మన కుటుంబాలని తన కుటుంబం అనుకున్నాడు
మన కష్టాలని తన కష్టం అనుకున్నాడు 
మనం ఏం చెప్పినా విన్నాడు
ఏం పెట్టినా తిన్నాడు
రాత్రి పగలు
ఎండా వానా 
ఏవీ గుర్తులేవు 
తనువుకి గాయమైనా తన కుటుంబానికి దూరమైనా 
క్షణం ఆలోచించలేదు 
జనం ... కేవలం జనం 
నిద్రలో మెలుకువలో జనం 
జనం జనం 
మన కోసం దీక్షలు చేసి తను కడుపు మాడ్చుకున్నాడు 
మన కోసం పోరాడి తను సగం అయ్యాడు 
గాయం మనది బాధ తనది 
గోడు మనది గొంతు తనది 
సమస్య మనది సాధన తనది 
విమర్శల జడివానలో సైతం జనం కోసం నడిచాడు 
జనమే తన ఆశ జనమే తన శ్వాస 

జనమే గమ్యం జనమే ధ్యేయం 

అదే అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది 
అవకాశావాదులకి అసూయ పుట్టించింది 
వాళ్ళ కాళ్ళకింద భూమిని కదిలించింది 
జగన్ ఎదిగితే తమ పరిస్థితి ఏంటి ?
జనం కదిలితే తమ ఉనికి ఏంటి ?
తాము కన్న కలలు
కట్టుకున్న అధికార సౌధాల మాటేంటి 
భయం 
డిల్లీ నుంచి గల్లీ దాకా అదే భయం 
హస్తంతో పాటు సమస్తాన్నీ అల్లుకున్న భయం 
భవిష్యత్తు పట్ల అలుముకున్న భయం 
ఆ భయమే మహానేతను సైతం మట్టుపెట్టే మహాకుట్రకు తెరతీసింది 
అధికారం ఇచ్చిన నాయకుడిని అర్ధంతరంగా అస్తమించేటట్లు చేసింది 
ఆ భయమే 
జననేతను దోషిని చేసి చెరసాలలో పెట్టించింది 
కల్మషం ఎరుగని నేతను కారాగారం లో పెట్టించింది 
మహానేత కుటుంబాన్ని నడిరోడ్డుకి తీసుకొచ్చింది 
ఆ భయమే పచ్చ రాజకీయాలకు పచ్చజెండా ఊపింది 
అబద్దాలను అచ్చుగుద్ది జనం మీదకి వదిలిపెట్టేలా చేసింది 
అవాస్తవాలను వార్తలుగా ప్రతి వాకిట్లోకి చేర్చే కుట్రకి కంకణం కట్టుకుంది
నిజాలు వెలికితీయాల్సిన అధికారులను సైతం 
కుట్రక్రీడలో భాగస్వాములను చేసింది 
లీకులతో అనైతికతకు అగ్రతాంబూలం ఇచ్చింది 
చివరకి మాట చెల్లుబాటు చేసుకోవడానికి
మనిషినే లేకుండా చేయడానికి కూడా మంత్రాంగం నడుపుతోంది. 
ఇన్ని జరుగుతున్నామనం మాత్రం మౌనంగానే ఉన్నాం 
నాకోడి నా కుంపటి అనుకుంటూ 
బ్రతుకుబండిని భారంగా ఈడ్చుకుంటూ 
బ్రతికేస్తూనే ఉన్నాం

రాజన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ 
ఉచిత విద్యుత్తు పించన్లూ
రాజన్న కట్టించిన ఇళ్ళూ
రాజన్న చేసిన మేళ్లూ 
జగనన్న పంచిన ప్రేమ ప్రతి క్షణం కనిపిస్తున్నా
అనుక్షణం అగుపిస్తున్నా
మామూలుగానే బ్రతికేస్తున్నాం 
ఏమీ ఎరగనట్టూ అసలేమీ జరగనట్టూ 

జనం మాత్రం తమపని తాము చేసారు 
పంటిబిగువున దాచుకున్న కోపాన్ని లావాలా బయటకు వెళ్లగక్కారు 
అధికారం అవకాశవాదం 
ప్రభుత్వం ప్రతిపక్షం కుమ్మక్కైనా 
నోట్లు కుమ్మరించినా 
అధికారాన్ని మొహరించినా 
సిరాచుక్క పడిన చూపుడు వేలు సాక్షిగా 
జగన్ కే జై కొట్టారు 
జనంకోసం నిలబడిన వారిని సగర్వంగా నిలబెట్టారు 
ఉప్పుతిన్న విశ్వాసాన్ని 
ఓట్లరూపంలో జననేతకు ఘనవిజయంగా అందించారు 
మేలు మరచిపోవటం నేతల లక్షణమే తప్ప 
జనం లక్షణం కాదని 
వోటింగ్ మిషన్ల మీద ఒట్టేసి మరీ చెప్పారు 
కోర్టులు ఏమన్నాప్రజా కోర్టుల తీర్పు ఏంటో చెప్పకనే చెప్పారు 
ఇప్పుడు చెప్పాల్సింది మనమే

ఇంకా ఉష్ట్ర పక్షుల్లా తలలు ఇసుకలో పెట్టి బతికేద్దామా 
జననేతకు అండగా జెండా ఎగరేద్దామా 
తేల్చుకుందాం 

లేకపోతే మనం బ్రతికే ఉన్నాం అనటానికి సాక్ష్యం 
కేవలం జనాభా లెక్కలు మాత్రమే !!



       by : Chary Db

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!