నర్సీపట్నం, పాడేరు(విశాఖ జిల్లా), న్యూస్‌లైన్:కేంద్రంలో తమను వ్యతిరేకించేవారిపై సీబీఐని ఉసిగొల్పడం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా వస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వ్యాఖ్యానించారు. తనకు మద్దతుగా ఉన్నవారిని నీతిపరులని చెప్పుకొచ్చే కాంగ్రెస్ నాయకులు, వారిని వ్యతిరేకిస్తే వెంటనే అవినీతిపరులంటూ సీబీఐ కేసులు నమోదు చేసేలా ఒత్తిడి చేస్తారని ఆమె దుయ్యబట్టారు. మంగళవారం నర్సీపట్నంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇలా వ్యవహరించడం వల్లే సీబీఐని లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడం వల్లే వైఎస్సార్ పార్టీ అధికస్థానాల్లో గెలుపొందిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల టైమ్స్ మేగజైన్‌లో పేర్కొన్న విధంగా ప్రధానమంత్రి మన్మోహన్ సామర్ధ్యానికి తగ్గట్టుగా పనిచేయలేకపోతున్నారని విమర్శించారు. ఆహార భద్రత బిల్లు తెచ్చేందుకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 3 వరకు దేశరాజధానిలో జాతీయ ధర్నా చేపడుతున్నామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment