తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మునిగిపోతున్న పడవ అని జూపూడి ప్రభాకరరావు అన్నారు. అతి త్వరలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని జూపూడి జోస్యం చెప్పారు. కొందరు ముందుగా మేల్కొని జగన్ వైపు వస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ ఆఫీసుకు తాళాలు వేసుకునే పరిస్థితి అతి త్వరలోనే వస్తుందన్నారు. 2009 తర్వాత 41 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు గెలవలేదని ఆయన తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పొందలేని టీడీపీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారని జూపూడి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ బాబు హయాంలో ఖాళీ అవుతోందన్నారు. జగన్, వైఎస్ఆర్ సీపీపై నిందలు వేస్తే ఏ ఒక్కరూ చూస్తూ ఊరుకోరని... మీకు చేతనైతే టీడీపీ పార్టీని బాగుచేసుకోండని జూపూడి ప్రభాకరరావు సలహా ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment