మంత్రి మాణిక్యవరప్రసాద్‌కు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. వాన్ పిక్ భూములను రద్దు చేస్తామన్న మంత్రి తన మాట నిలబెట్టుకోవాలని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. వాన్ పిక్ ఒప్పందం రద్దు చేస్తే మంత్రికి తామంతా మద్దతు తెలుపుతామన్నారు. మంత్రి మాటమీద నిలబడకపోతే ఇన్ ఛార్జ్ మంత్రిగా ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదని బాలినేని అన్నారు. ఉప ఎన్నికలకు ముందు అధికారపార్టీ నేతలు 40వేల ఓట్లు కావాలనే తొలగించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని స్వయంగా చెప్పారన్నారు. తక్షణమే తొలగించిన ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని బాలినేని డిమాండ్ చేశారు. |
Tuesday, 10 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment