మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వైఎస్ఆర్ సీపీ నేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే పొన్నాలదే బాధ్యత వహించాలని కొమ్మూరి అన్నారు. సుప్రీం కోర్టులో పొన్నాలకు ఎదురుదెబ్బ తగిలినప్పటి నుంచి నాకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. కేసు వెంటనే విత్‌డ్రా చేసుకోమంటూ డిమాండ్ చేస్తున్నారని మీడియా సమావేశంలో కొమ్మూరి తెలిపారు. బెదిరింపులకు తాను లొంగననని, పొన్నాలకు దమ్ముంటే నిజాయితీగా కేసు ఎదుర్కోవాలన్నారు. భద్రత లేకున్నా జనగామ నియోజకవర్గ ప్రజలే తనను కాపాడుకుంటారని ఆయన అన్నారు. బెదిరింపు కాల్స్ వ్యవహారంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
Tuesday, 10 July 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment