Saturday, 14 July 2012
అక్టోబర్ చివరి నాటికి వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కమిటీ
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీ వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర కమిటీ అక్టోబర్ చివరి నాటికి ఏర్పాటు కానుంది. శనివారమిక్కడ ఫెడరేషన్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 2012-13 విద్యాసంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15 నాటికి జిల్లా, మండలాల పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటవుతాయి. ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ధర్నా చేయాలని తీర్మానించారు. సమావేశానికి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళాపతి అధ్యక్షత వహించారు. అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment