
‘నందమూరి ’ అభిమానులను సాగనంపుతున్న వైనం
నానితో బోణి... లైన్లో వంశీ
మనస్తాపం చెందుతున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

వ్యూహాత్మకంగా వంశీకి ఎంపీ టికెట్...



హరికృష్ణ పర్యటనప్పుడే....

ఈ నేపథ్యంలోనే వంశీ, నానిలు అనేకసార్లు దేవినేని ఉమ నాయకత్వం కింద తాము పనిచేయలేమని తెగేసి చెప్పారు. అయితే చంద్రబాబు ఉమామహేశ్వరరావుకే అండగా నిలిచేవారు. ఏడాదిగా విభేదాలు కొనసాగుతున్నా బాబు ఏనాడూ వారిని పిలిచి మాట్లాడే యత్నం చేయలేదు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విషయంలోనూ ఉమా వైఖరి విమర్శలకు దారి తీసింది. ఆ సినిమా విడుదల రోజున పోర్టు సాధన కోసమంటూ సమ్మెకు పిలుపు ఇవ్వడంపై కొడాలి నాని, వంశీ అభ్యంతరం చెప్పారు.
గుడివాడలో బంద్ ఉన్నా సినిమా అన్ని షోలు వేసేటట్లు నాని చూశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను దెబ్బకొట్టేందుకే కృష్ణాజిల్లా నేతలు ఇలా వ్యవహరించారని ఆయన అభిమానులు విమర్శించారు. ఈ సినిమా చూడొద్దంటూ ఎస్‌ఎంఎస్‌లు ఇవ్వడం కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్‌ను రాజకీయ ఆరంగేట్రం చేయించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతిసే యత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన వర్గం అండగా నిలవడం ఎన్టీఆర్ అభిమానులను క్రమంగా పార్టీకి దూరం చేసింది.
ఇలా ఎన్టీఆర్ కుటుంబీకులను పార్టీకి పూర్తి దూరంగా ఉంచి ఆయన ముద్రను క్రమేణా చెరిపే యత్నం చంద్రబాబు చేస్తున్నారని, దాన్ని కృష్ణాజిల్లా నుంచే ప్రారంభించారనే వాద నలున్నాయి. ఈ పరిణామాలు ఎన్టీఆర్ అభిమానులను కలచి వేస్తున్నాయి.
No comments:
Post a Comment