వరంగల్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గీసుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వీరగోని రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లపంపిణీ చేశారు. మహబూబాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నర్సన్నపేట, ఖానాపురంలో వైఎస్ఆర్ సీపీ నేత నాడెం శాంతికుమార్ వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హన్మకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆశమ్ కళ్యాణ్ ఆధ్వర్యంలో బ్లెండ్ స్కూల్, మనో వికాస కేంద్రం, మెటర్నిటీ ఆస్పత్రిలలో పండ్లపంపిణీ జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment