హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాం నాటి సువర్ణయుగం త్వరలోనే వస్తుందని ప్రజల్లో భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. వైఎస్ చేపట్టిన 'ప్రజాప్రస్థానం' ను షర్మిలా మరోసారి కొనసాగించనున్నట్ఉ విజయమ్మ తెలిపారు.
ఇబ్బందుల్లో ఉన్న ప్రజలుకు బాసటగా నిలువాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టినందున షర్మిలా పాదయాత్ర చేయడానికి ముందుకు వచ్చారని ఆమె అన్నారు.
మహానేత ప్రజల దగ్గరికి ఎలా వచ్చారో.. ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో అదే విధంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్పూర్తితో పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. పాదయాత్ర అక్టోబర్ 18 తేదిన వైఎస్ఆర జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగుతుందని అన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్య ఉండాలని జగన్ చెప్పారని.. బెయిల్ పై విడుదలయ్యాక జగన్ పాదయాత్రను కొనసాగిస్తారని.. అప్పటి వరకు షర్మిల పాదయాత్రను నిర్వహిస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని సాధారణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పన్నులు, సర్ ఛార్జీల పేరుతో ప్రజలను ఇబ్బందుల్లోకి ప్రభుత్వం తోసిందని విజయమ్మ అన్నారు. వైఎస్ పథకాలను కొనసాగించాలని అంటూనే మహానేతపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర, జగన్ ఓదార్పుయాత్రను అనుకరించడానికే తప్ప చంద్రబాబు పాదయాత్రతో జరిగేమిలేదని ఆమె అన్నారు.
ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు, వడ్డీ లేని రుణాలు, 108 సర్వీసుల పథకాలు నిర్వీర్యం అయ్యారని.. నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయని.. ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఊసే లేదని.. ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని.. 104 సర్వీస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇలాంటి సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో పాదయాత్ర చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పాదయాత్రను చేపడుతున్నామన్నారు.
ఫీజు దీక్షపై హైదరాబాద్, ఒంగోలు ప్రాంతాల్లో జగన్ దీక్ష చేశారని.. తాను కూడా ఏలూరు, హైదరాబాద్ లో దీక్ష చేపట్టినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. విద్యుత్ సంక్షోభంతో రైతులు ఇబ్బందులకు లోనవుతున్నారని అన్నారు. తమ పార్టీ చిన్నపార్టీ అని.. ప్రభుత్వాన్ని ఎదురించే శక్తి తమకు లేదని.. అందుకే ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్నా ఏమి చేయలేకపోతున్నామని.. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ స్పందించడంలేదని విజయమ్మ విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు చిదంబరం కలువగానే విచారణ లేకుండానే ఈడీ నోటీసులు జారీ చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తో కుమ్మక్కైందనడానికి ఇంతకంటే రుజువు ఏమి అక్కర్లేదన్నారు.

No comments:
Post a Comment