ఢిల్లీ: యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆస్పత్రి కోసం సేకరించిన భూమిని డీఎల్‌ఎఫ్ సంస్థకు ఇచ్చారని కేజ్రివాల్ ఆరోపించారు. డీఎల్‌ఎఫ్‌కు హర్యానా సర్కార్ ఏజెంట్‌గా పనిచేసిందని ఆయన ఆరోపించారు. సెజ్‌లో 50 శాతం వాటా పొందిన వెంటనే వాద్రా అధిక ధరకు వాటాను అమ్మేశారన్నారు.
గతంలో హర్యానా హైకోర్టు జోక్యం చేసుకుని భూ కేటాయింపులు రద్దు చేసిందని, హర్యానా ప్రభుత్వం , డీఎల్‌ఎఫ్ మధ్య అక్రమ ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదలచేయాలని కేజ్రివాల్ డిమాండ్ చేశారు. వాద్రాకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు డీఎల్‌ఎఫ్ బ్యాలెన్స్ షీట్‌లో ఆధారాలున్నాయన్నారు. తాము ఇచ్చిన ఆధారాలు ఆదాయపన్ను శాఖకు సరిపోతాయన్నారు. అయితే ఆదాయపన్ను వివరాలు సక్రమంగానే ఉన్నాయని చిదంబరం క్లిన్‌చిట్ ఇవ్వడం శోచనీయమన్నారు.
రాబర్ట్ వాద్రాను కాపాడేందుకు ఆర్ధిక మంత్రి చిదంబరం రక్షణ కవచంగా నిలబడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాబర్ట్ వాద్రా వ్యవహారాలలో అధికారులు జోక్యం చేసుకోవద్దని చిదంబరం అంటున్నారని.. పరోక్షంగా ఆదాయపన్ను శాఖ అధికారులను చిదంబరం బెదిరిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూమిని డీఎల్ఎఫ్‌కు ఇవ్వడం అక్రమమని కేజ్రివాల్ అన్నారు.

No comments:
Post a Comment