వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేమని సిబిఐ డైరెక్టర్ ఎకె సింగ్ అన్నట్లు కధనాలు వస్తున్నాయి. ఈ కేసులో విదేశాల నుంచి సమాచారం రావలసి ఉందని ఆయన అన్నారు. అయితే వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెబుతున్నారు.దర్యాప్తునకు కాలపరిమితి చెప్పలేమన్నారు.దీనిని బట్టి చూస్తే జగన్ ను ఇప్పట్లో జైలు నుంచి విడుదల అవడం కష్టమే కావచ్చు. సిబిఐ దర్యాప్తు పూర్తి అయ్యేవరకు బెయిల్ దరఖాస్తు చేసుకోవద్దని ఎన్నడూ లేని విదంగా సుప్రింకోర్టు ఆదేశం ఇవ్వడం, ఎప్పటికి దర్యాప్తు పూర్తి అవుతుందో చెప్పలేనని సిబిఐ డైరెక్టర్ అనడం చూస్తుంటే జగన్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.కనీసం వచ్చే ఎన్నికల వరకు జగన్ బయటకు రాకుండా సిబిఐ అడ్డుకుంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి.
http://kommineni.info/articles/dailyarticles/content_20121011_13.php
No comments:
Post a Comment