అనంతపురం: జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ నేతల ఇళ్లను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. మున్సిపల్ రిజర్వ్ సైట్ల పేరుతో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ఖాళీ చేయించడానికి అధికార పార్టీ నేతలు ..అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జగన్ పార్టీలో చేరడమే తాము చేసుకున్న పాపామా అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణంలో ఖరీదైన భవనాలను విడిచిపెట్టి ఇలా అమాయకుల జోలికి వస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని అధికారులకు , కాంగ్రెస్ నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment