హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎంను ఎండగడుతున్నారే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె నుంచి దించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని ఎంపీ సబ్బం హరి ప్రశ్నించారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టే దిశగా ఎందుకు అడుగులు వేయటం లేదని ప్రశ్నించారు. అలాంటప్పుడు ప్రజలు చంద్రబాబు యాత్రను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం హరి ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో కూడా మాట్లాడారు. యావత్ ప్రజల అభిమానం జగన్ కుటుంబ సభ్యులకు ఉందన్నారు. మధ్యంతర ఎన్నికలు రాకుండా కాలయాపన చేయడమే బాబు వ్యూహమన్నారు. ఎన్నికలొస్తే గెలవలేమనే ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షం సహకారం అందిస్తోందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment