పాదయాత్రపై పేటెంట్ హక్కు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానిదేనని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే షర్మిలమ్మ ప్రజా ప్రస్థానం చేపట్టారని ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. చరిత్రలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘటన ఆమెకే దక్కుతుందన్నారు. ప్రజాప్రస్థానం ప్రారంభం రోజున ఇడుపులపాయలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని భూమన వెల్లడించారు.
వైఎస్ మరణం తర్వాత ప్రజలను ప్రభుత్వం రాబందుల్లా పీక్కుతింటోందని భూమన మండిపడ్డారు. వైఎస్ఆర్ ఆశయాలను, లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. పదవి కోసమే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నరని ఎద్దేవా చేశారు. బాబు పాదయాత్రను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ నేతలు అంతకు ముందు మహానేత వైఎస్ఆర్ సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డితో సహా పలువురు నేతలు మహానేత వైఎస్‌ఆర్ ఘాట్‌కు ఘన నివాళి అర్పించారు.

No comments:
Post a Comment