ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావుకు మాతృవియోగం కలిగింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కొద్దిరోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న భూదేవమ్మ బుధవారం మరణించారు. భూదేవమ్మ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిమ్స్ కు వెళ్లి భూదేవమ్మను పరామర్శించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకర్‌రావు తల్లి భూదేవమ్మ అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం సంకువారికుంటలో జరుగుతాయి. భూదేవమ్మ మృతికి వైఎస్‌ఆర్ సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, సోమయాజులు, కొణతాల రామకృష్ణ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.

No comments:
Post a Comment