న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వాద్రా, డీఎల్ఎఫ్ సంస్థలపై సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైన పిటీషన్‌పై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. డీఎల్ఎఫ్, వాద్రా మధ్య క్విడ్ ప్రో కో లావాదేవీలు జరిగాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తోన్న నేపధ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 21కి వాయిదా పడింది.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=467029&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=467029&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment