ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజా స్పందన లేదని నల్లపురెడ్డి అన్నారు. తొమ్మిది ఏళ్ల పాలనలో ఉచిత కరెంట్ ఇవ్వని బాబు ఇప్పుడు ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం కుర్చీ కోసం బాబు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో చంద్రబాబు అంత అవినీతిపరుడు మరొకరు లేరని నల్లపురెడ్డి అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టాలని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment