వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ శనివారం శ్రీకాకుళం జిల్లా వెళ్లనున్నారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ ఈ నెల 4న మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయమ్మ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయమ్మ శనివారం ఉదయం 9.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నర్సన్నపేటలోని మబజాల గ్రామానికి వెళ్లి ధర్మాన కుటుంబ సభ్యులను కలుస్తారు. సాయంత్రం 6.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment