దేశ రాజకీయ చరిత్రలో ఓ మహిళ మరో ప్రజా ప్రస్థానంలో పాదయాత్ర చేయడం సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్ మనుగడకు చంద్రబాబు సహకరిస్తున్నారని అంబటి ఆరోపించారు. అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్‌తో చంద్రబాబు లాలూచీ పడుతున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, సాక్షిని అణచాలని టీడీపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయని అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment