9 జిల్లాల్లో హాస్టళ్లు పరిశీలించిన నేతలు
నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రతినిధి: అరకొర వసతులు, చాలీ చాలని మెస్‌చార్జీలతో, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం విరుచుకుపడింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలు.. నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు వండి వడ్డిస్తున్న మధ్యాహ్నం భోజనం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. నల్లగొండ ఎస్టీ బాలికల కళాశాల హాస్టల్‌ను వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి సందర్శించారు. వసతి గృహంలో అన్నం, కూర, చారు, ఇతర సౌకర్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. మెస్‌చార్జీలు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.17 ఇస్తే ఎలా సరిపోతాయని ఈ సందర్భంగా పుత్తా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల ఆకలికేకలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. నల్లగొండ హాస్టల్‌లో ఉన్న 150మంది విద్యార్థులకు కేవలం రెండు బాత్‌రూంలు, రెండు మరుగుదొడ్లు ఎలా సరిపోతాయో సంక్షేమ శాఖ అధికారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment