పేదల కోసమే షర్మిల పాదయాత్ర: భూమన
పేద, బడుగు, బలహీనవర్గాలతో పాటు రైతుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పాదయాత్ర చేపట్టనున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి అర్బన్ మండలం రాఘవేంద్రనగర్‌లో గురువారం ఆయన ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల దాదాపు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారని వెల్లడించారు. వైఎస్‌ఆర్ పాదయాత్ర ద్వారా పేదల సమస్యలను తెలుసుకుని, అధికారంలోకి రాగానే వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన మరణానంతరం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పోరాడిన జగన్‌ను కుట్రలు కుతంత్రాలతో జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment