ప్రకాశం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. అత్యంత అవినీతి ముఖ్యమంత్రిల్లో చంద్రబాబు నాయుడు ఒకరని కిరణ్ విమర్శించారు. త్వరలో చంద్రబాబుపై కోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు పెడుతుందని సీఎం కిరణ్ భవిష్యవాణి చెప్పారు. రూ. కోటి విలువైన భూమిని రూ.50 వేలకు చంద్రబాబు విక్రయించారని సీఎం తెలిపారు. ఇలా 450 ఎకరాలు కట్టబెట్టారని, ఈ అంశంపై కోర్డు ఆదేశాల మేరకు సీబీఐ కేసు పెడుతుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment