తిరుమల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. అన్నిరంగాల్లోనూ కిరణ్ సర్కార్ విఫలమైందని ఆయన విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర అధికారదాహంతో కూడుకుందని భూమన అన్నారు. ప్రజల కడగండ్లు తుడిచేందుకే షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయితే ఎలాంటి పాలన అందిస్తారో షర్మిలమ్మ భరోసా ఇస్తారని భూమన వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment