అదేమిటో కానీ ఆ మధ్య తాడెత్తు నుంచి ఎగిరిపడ్డ చంద్రబాబుకి ఏదో పోగొట్టుకున్న ట్టనిపించింది. ఇంకా తను బతికున్నాడో లేదో తేల్చుకోవడానికి నెలకోసారి డాక్టర్లతో పరీ క్షలు చేయించుకుని, బతికున్నట్టు సర్టిఫై చేయించుకుని తృప్తిపడుతున్నాడు.
అడపాదడపా గిట్టని వారి మీద అవా కులూ చెవాకులూ పేలి, వాళ్లతో నానా తిట్లు తిని... ‘‘హమ్మయ్యా! ఇంకా అబద్ధాలాడగలు గుతున్నానంటే నేను బతికి ఉన్నట్టే’’ అని ఊపిరి పీల్చుకున్నాడు.
‘‘నా తిట్లు అబద్ధం కాదు. పచ్చి నిజా లు. అందుకనే సత్యం అంటే గిట్టనివాళ్లు ఉడు క్కుంటున్నారు’’ అని జనాన్ని నమ్మించాలని చూశాడు. అయినా జనం ఉలకడం లేదు. పలకడం లేదు. దాంతో చంద్రబాబుకి తనేదో పోగొట్టుకున్నానన్న అనుమానం దెయ్యం పట్టినట్టు పట్టుకుంది.
‘‘మీ కాళ్ల కింద భూమి బద్ధలవుతోంది. మిమ్మల్నేలుతున్న ప్రభువులు అవినీతిని ఆశ్ర యించి బతుకుతున్నారు. దేశాన్ని తెగనమ్ము తున్నారు. మీ నెత్తిమీద ఆకాశం పేలిపోతుం ది. ఇప్పటికైనా మేల్కొనండి. సత్యాన్ని గ్రహించండి. నన్ను నమ్మండి. మిమ్మల్ని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా చూసుకుంటాను. ఈ అవి నీతిపరులని మీ కడుపు మంటతో, మండే గుండెలతో బుగ్గి చేసెయ్యండి... అయి పోయిందైపోయింది... ఈ ప్రభుత్వం పనైపో యింది. రేపటి రాజ్యం నా భోజ్యం. అప్పుడు మీకేసమస్యా ఉండదు. సుఖమే సుఖం. మిమ్మల్నీ మీ ఓట్లనీ ఫ్రిజ్‌లో భద్రపరుస్తాను’’ అని ఎంతగా ఆవేశపడ్డా జనంలో కదలిక లేదు. దాంతో తానేదో కోల్పోయానని, అం దుకే ఎవరూ తనని అపోజిషన్ నాయకుడిగా కూడా గుర్తించడం లేదని, ఇలాగైతే ఇవాళో రేపో తన భార్యా, కొడుక్కూడా తనను కాదని ఒదిలేస్తారని భయంతో వణికిపోయాడు.
తను పోగొట్టుకున్నదేమిటో, తనలో వచ్చిన మార్పేమిటో పోల్చుకోవడానికి అద్దం లోకి చూసుకున్నాడు. చిత్రం... అద్దంలో చంద్రుడూ లేడు, చంద్ర బింబమూ లేదు. అస్తిపంజరానికి చర్మం తొడుక్కున్న వాళ్లాగున్నాడు. దాంతో ఉలిక్కిపడి... కండలు కరిగిపోయినా, గుండెలు జారిపోయినా ఎలా గైనా సరే పదవి దక్కించుకోవాలి. అప్పుడు తనకే కాదు, తన నీడక్కూడా అంతా దండం పెడతారు. అలా జరగాలంటే తను పదవి సం పాదించాలి. ప్రధాన మంత్రి పదవి కాకపో యినా కనీసం ముఖ్యమంత్రి పదవినైనా దక్కించుకోవాలనుకున్నాడు.
అప్పుడు తట్టింది... తను ఎగిరిపడ్డప్పు డు పోగొట్టుకున్నది ప్రాణాల్ని కాదు. సాను భూతి ఓట్లు సంపాదించుకొని, పదవిని పది కాలాలు పదిలంగా ఉంచుకోవాలన్న ఆబతో ముందుగానే ఎన్నికలకెళ్లి ఉన్న పదవి పోగొట్టు కున్నట్టు. అంటే తను పోగొట్టుకున్నది ప్రాణం కాదు, పదవే అని గ్రహించాడు.
పదవి ఒకర్ని తిడితే వచ్చేది కాదు. తెగె డితే లభించేది అంతకన్నా కాదు. జనంతో మమేకం అయితే కానీ సాధించలేననుకున్నా డు. ఆ పనిచేసిన రాజశేఖరుడి అడుగుజాడల్లో నడవక తప్పదని వాతలు పెట్టుకుంటూ పాద యాత్ర చేపట్టాడు.
‘‘మాకు రూపాయి కిలో బియ్యం వద్దు. ప్రజల వద్దకి పాలన వద్దు. గ్యాస్ కావాలి. సబ్సిడీ గ్యాస్ కావాలి’’ అన్న ప్రజల డిమాం డ్‌తో నోరు కలిపి ‘‘ఇంటింటికీ గ్యాస్, ఉచిత గ్యాస్, గోబర్ గ్యాస్... నా పాలన వచ్చే వర కూ ఒంటికీ రెంటికీ వెళ్లకుండా నిలవుంచు కోండి. ఎవరి గ్యాస్ వాళ్లకే ఉచితంగా ఇస్తాను’’ అని హామీ ఇచ్చాడు.
హాశ్చర్యపోయిన జనం, భయంతో వణి కిపోయారు. మౌనమే సమాధానంగా ఉండి పోయారు. దాంతో చంద్రబాబు తను పదవి పోగొట్టుకున్నాడు కాబట్టి, జనం తనని గుర్తిం చడం లేదనుకున్నాడు.
‘‘నేను చంద్రబాబుని. తొమ్మిదేళ్ల నా పాలనలో అమెరికా సూర్య కాంతిని చీకట్లో మీకు చల్లగా జేర్చిన వాణ్ణి. నా పాలనలో నీతి లేకపోయినా, నన్ను పెద్దలంతా మెచ్చుకు న్నారు. తల్లులంతా కడుపులో దాచుకున్నారు. తెలుగాంధ్రానంతా మర్చిపోయారు. అమెరి కాంధ్రనే అంతా గుర్తుపెట్టుకున్నారు. మీ పిల్లలకి దేశ దేశాల్లో ఉపాధి హోదా దక్కింది’’ అని నోరారిపోయేంతగా తనని తాను పొగు డుకున్నాడు. అయినా ఎవరూ చలించలేదు. అతన్ని గుర్తుపట్టలేదు. నాటు మందులమ్ము కునే వాణ్ణి చూసినట్లుగా చూశారంతా.
‘‘అన్ని జబ్బులకీ మందులున్నాయ్. పురుగుల మందులున్నాయ్. పాముల మం దులున్నాయ్.
విషజ్వరాలకీ మందులున్నా య్’’ అంటూ రాగం తీశాడు బాబు.
అయినా జనంలో చలనం లేదు.
దాంతో ఒక్కసారిగా బాబుకు గతం తన్నుకుంటూ గుర్తుకొచ్చింది... ‘‘కంప్యూట ర్లుండగా వ్యవసాయం దండగన్నాను. అన్ని టికీ ఆ దేవుడే దిక్కన్నట్టుగా కంప్యూటర్లే పరిష్కారమన్నదీ నిజమే. అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యల పాలయ్యారు. కొందరికి రాష్ట్రం స్వర్ణాంధ్ర అయితే, మరికొందరికి దరిద్రాంధ్రగా మారింది. అలాంటి వాళ్లు చంద్రుడిలో చీకటిని చూశారు’’ అందుకే నన్ను మీరిప్పుడు గుర్తు పట్టలేకపోతున్నా రని కుమిలిపోయాడు.
‘‘ఈ అసమర్థ పాలనలో కరెంటు కోత లతో చంద్రకాంతిని కోల్పోయాను. దాన్ని వెదుక్కుంటూ మీ వద్దకొచ్చానం’’టూ గోడు గోడున తన బాధ వెళ్లబోసుకున్నాడు బాబు. దాంతో జనం మరింత అవాక్కయి... అధికారపక్షం ఎలాగూ పట్టించుకోవడంలేదు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా కరువైంది. ఆత్మ హత్యలే శరణ్యమని బెంబేలెత్తారు. పోగొట్టుకున్నది విశ్వాసం అని గ్రహిం చని బాబు, పదవిని వెదుక్కుంటూ కాలిబా టన పడ్డాడు.
కొండమీది బెండయ్య
No comments:
Post a Comment